ఎన్టీఆర్ వల్లే మనం ఈ స్థాయికి.. మోత్కుపల్లితో కేసీఆర్

11-03-2017 Sat 06:31 | Both States
టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి తన ఏకైక కుమార్తె డాక్టర్ నీహారిక వివాహానికి ఆహ్వానించారు. ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేసిన ఈ ఇద్దరు నేతలు గత స్మృతులను నెమరువేసుకున్నారు. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టడం వల్ల తెలంగాణలో ఎంతోమంది రాజకీయంగా ఎదిగారని, మనం కూడా ఈ స్థాయికి రావడానికి ఆయనే కారణమన్న మోత్కుపల్లి వ్యాఖ్యలకు కేసీఆర్ ఔనన్నారు. ఎన్టీఆర్ గొప్ప నేత అని, ఇది కాదనలేని సత్యమని కేసీఆర్ బదులిచ్చారు. రాష్ట్రంలో రిక్షా కార్మికులకు రెండు జతల బట్టలు ఇవ్వాలని మనం ఎన్టీఆర్‌ను కలిసి అడిగినప్పుడు ఆయన వెంటనే అంగీకరించిన విషయాన్ని మోత్కుపల్లి గుర్తు చేయగా.. కేసీఆర్ వెంటనే కల్పించుకుని ‘‘నర్సన్నా.. నీకు అన్నీ బాగానే గుర్తున్నాయ్’’ అన్నారు.

ఈ సందర్భంగా వారి మధ్య చంద్రబాబునాయుడు ప్రస్తావన కూడా వచ్చింది. ఉద్యమ సమయంలో పరస్పరం విమర్శలు చేసుకున్నా తనకు చంద్రబాబు అంటే వ్యతిరేకత ఏమీ లేదని కేసీఆర్ పేర్కొన్నారు. అలాగే  గవర్నర్ పదవి గురించి కేసీఆర్ ఆరా తీసినప్పుడు ‘అంతా భగవంతుడి దయ’ అని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఎలా జరగాల్సి ఉంటే అలా జరుగుతుందని మోత్కుపల్లి అన్నారు. కాగా డాక్టర్ నీహారిక వివాహం ఈనెల 15న హైదరాబాద్‌లో జరగనుంది.

More Telugu News

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19
..more